ETV Bharat / state

Liquor tenders in Karimnagar:కరీంనగర్‌లో ఉద్రిక్తత.. జగిత్యాలలో యువకుడు ఆత్మహత్యాయత్నం

Liquor tenders in Karimnagar: మద్యం దుకాణాల కేటాయింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరీంనగర్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో ఓ షాపు విషయంలో వాగ్వాదం జరిగింది. అధికారులు ఆలస్యం చేస్తున్నారంటూ దరఖాస్తుదారులు అభ్యంతరం తెలిపారు. దీంతో కాసేపు ప్రక్రియ నిలిచిపోయింది. దుకాణం కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ జగిత్యాలలో యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

liquor shops tenders in Karimnagar
కరీంనగర్‌లో ఉద్రిక్తత
author img

By

Published : Nov 20, 2021, 6:48 PM IST

Updated : Nov 20, 2021, 10:41 PM IST

కరీంనగర్‌లో మద్యం దుకాణాల కేటాయింపులో(Liquor tenders in Karimnagar) ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఆరో నెంబర్‌ దుకాణం కేటాయించకుడా ఆలస్యం చేస్తున్నారంటూ అధికారుల తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికారులకు, దరఖాస్తుదారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లాలోని 94 మద్యం దుకాణాలను లక్కీ డ్రా ద్వారా కేటాయించారు.

ఆరో నంబర్ షాపు కేటాయింపు చేయకుండా అధికారులు తాత్సారం చేయడంతో దరఖాస్తుదారులు అభ్యంతరం చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఒకరు గైర్హాజర్ కావడంతోనే ఆ దుకాణం డ్రా(telangana liquor tender 2021) తీయకుండా పక్కన పెట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే దరఖాస్తుదారులంతా అతని నంబర్ తొలగించి మిగతా వారి నంబర్లతో డ్రా తీయాలని డిమాండ్ చేశారు.

కలెక్టర్ వార్నింగ్

అధికారులు మాత్రం ఇంకా 24 గంటల సమయం ఉంటుందని చెప్పడంతో దరఖాస్తుదారులు(liquor shop tender in telangana 2021) అభ్యంతరం తెలిపారు. అధికారులతో వాగ్వాదానికి దిగగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో లక్కీ డ్రా కాస్త వివాదాస్పదంగా మారింది. మేము కోట్ల రూపాయల పెట్టి దరఖాస్తులు చేసుకుంటే మమ్మల్ని బయటికి నెట్టేయడం ఏంటని అధికారులను నిలదీశారు. మీ ఇష్టం ఉన్నప్పుడు డ్రా తీసుకోండని మేము పాల్గొనమంటూ దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారంతా బయటికి వెళ్లిపోతుండగా జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్ నచ్చచెప్పారు. ఆ షాపు డ్రా పూర్తయ్యే వరకు మిగతా వాటిని కూడా నిలిపివేయాలని అడ్డుకోవడాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తప్పుబట్టారు. ఎవరైనా ఈ ప్రక్రియను అడ్డుకొంటే కేసులు నమోదు చేస్తామనడంతో గొడవ సద్దుమణిగింది.

జగిత్యాలలో యువకుడు ఆత్మహత్యాయత్నం

మద్యం దుకాణం కేటాయింపులో ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం(suicide attempt) చేశాడు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన మద్యం దుకాణాల లక్కీ డ్రాలో అధికారుల తీరును నిరసిస్తూ ఒంటిపై డిజిల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సారంగపూర్‌ మద్యం దుకాణానికి కేవలం ఆరు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని అధికారులు లాటరీ ప్రక్రియను నిలిపేశారు.

దీంతో రమేశ్‌ అనే యువకుడు తమకు అన్యాయం జగిగిందంటూ డీజిల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే జీవో ప్రకారం కనీసం 10 దరఖాస్తులు వస్తేనే లాటరీ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం సరికాదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

జగిత్యాలలో యువకుడు ఆత్మహత్యాయత్నం

ఇదీ చూడండి:

telangana liquor tender 2021: రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం లాటరీ.. అక్కడక్కడా ఉద్రిక్తత!

Last Updated : Nov 20, 2021, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.