ETV Bharat / state

మధ్యమానేరు ఉపకాలువకు గండి.. నీట మునిగిన పంట పొలాలు - ఉపకాలువకు గండి పడి నీట మునిగిన పంటలు

కాళేశ్వరం జలాలతో సాగునీరు అందించేందుకు మధ్యమానేరుకు అనుసంధానంగా నిర్మించిన కుడి ప్రధాన కాలువ ఉప కాలువకు... కరీంనగర్​ జిల్లా గన్నేరువరం వద్ద గండి పడింది. దీంతో నీరంతా వృథాగా పోయి... పంట పొలాలు నీట మునిగాయి.

kaleswaram sub canal leakage and crop floting in water
మధ్యమానేరు ఉపకాలువకు గండి.. నీట మునిగిన పంట పొలాలు
author img

By

Published : Aug 11, 2020, 1:52 PM IST

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పూర్తిగా మెట్ట ప్రాంతం. కాళేశ్వరం జలాలతో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం మధ్య మానేరుకు అనుసంధానంగా నిర్మించిన కుడి ప్రధాన కాలువ ద్వారా ఉప కాలువల నిర్మించారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల ద్వారా ఉప కాలువల నిర్మాణం జోరుగా సాగుతోంది. రెండేళ్లు గడిచినా ఆయా గ్రామాల్లో పనులు పూర్తి కాలేదు. ప్రధాన దారులకు అడ్డంగా నిర్మించే కల్వర్టులు ఏడాది గడుస్తున్నా నిర్మాణానికి నోచుకోవడంలేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నాసిరకం పనులతో గుత్తేదారులు వ్యవహరిస్తున్న తీరుకు అధికారులు పట్టిపట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. డి-8 ఉప కాలువకు గతంలో గండి పడి వరద నీరు వృథాగా పోయింది. గ్రామస్థలుు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోగా... ఆలస్యంగా మరమ్మతులు చేపట్టారు. మళ్లీ అదే చోట గండి పడింది. నీరంతా పంటపొలాలకు చేరి నేలమట్టమయ్యాయి. నీట మునిగిన పంటలకు ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.