కరీంనగర్లో నగరవాసులు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో హోలీ వేడుకలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సాహంగా చేసుకున్నారు.
గత ఏడాది కరోనా నేపథ్యంలో హోలీ వేడుకలను నిర్వహించుకోలేక పోయామని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాది పండుగలను సంప్రదాయ బద్దంగా కొవిడ్ నియమాలను పాటిస్తూ జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదీ చూడండి: మరో రెండురోజుల్లో ఎగువ మానేరుకు కాళేశ్వరం జలాలు