ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి కరీంనగర్ తడిసిముద్దైంది. నగరంతో పాటు తిమ్మాపూర్, జమ్మికుంట, హుజూరాబాద్, సుల్తానాబాద్, చందుర్తి, సిరిసిల్ల, రామడుగు, శంకరపట్నం, గన్నేరువరంతో పాటు పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలోనూ ఏకధాటిగా ముసురు కురుస్తుండటం వల్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారడం వల్ల నగరపాలక సంస్థ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకొంటోంది. మరో రెండు రోజుల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగరపాలక అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.