కరీంనగర్ జిల్లాలోని చింతకుంటలో నిర్మిస్తున్న తెరాస పార్టీ కార్యాలయ భవన పనులను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. తమకు బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిడి ఉందని.. ఆదుకోవాలని రాజీవ్ గృహ కల్ప నివాసులు మంత్రికి విన్నవించారు. ఫోన్లో బ్యాంక్ అధికారులతో మాట్లాడిన మంత్రి... పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లపై దాడులు సరికాదన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండిః ముంబయి లాల్బాగ్ గణేశ్ నిమజ్జనంలో కోలాహలం