ETV Bharat / state

అదరహో అనిపించే సిల్వర్‌ ఫిలిగ్రీ కళ.. తెచ్చేను అవార్డుల కళ

Filigree Art in karimnagar: ఆ కళాకారుల పనితనం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. వారి చేతుల్లో రూపుదిద్దుకొనే వెండి నగీషీ వస్తువులను చూస్తే అబ్బా.. ఎంత బాగున్నాయో అనుకునేలా చేస్తాయి. కరీంనగర్‌కే వన్నె తెచ్చిన ఈ నగిషీ కళ పేరే 'సిల్వర్ ఫిలిగ్రీ '.. రెండు వందల ఏళ్ల క్రితం ఈ కళ పురుడు పోసుకొంది.ఈ కళతో కరీంనగర్ జిల్లా జాతీయ, అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపును సాధిస్తోంది.

Filigree Art in karimnagar
అవార్డుల పల్లకి
author img

By

Published : Nov 26, 2022, 4:26 PM IST

అదరహో అనిపించే సిల్వర్‌ ఫిలిగ్రీ కళ.. తెచ్చేను అవార్డుల కళ

Filigree Art in karimnagar: కరీంనగర్ ఫిలిగ్రీ వస్తువులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. తొలుత పాన్‌దాన్‌లు(పాన్ డబ్బా), వెండి కంచాలు, వెండి సెంట్ డబ్బాలు(అత్తర్ దాన్లు) ఎక్కువగా తయారు చేసేవారు. ఆ తర్వాతి క్రమంలో ఈ కళకు సంబంధించిన రహస్యాలు బయటి వ్యక్తులకు చెప్పడానికి ఇక్కడి వారు ఇష్ట పడకపోవడంతో ఇది కరీంనగర్‌కే పరిమితం అయ్యింది. ఆ రహస్య గుంభనమే సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్ పట్టణానికే సొంతం అయ్యేలా చేసింది. ఎంతో ప్రావీణ్యం,సృజనాత్మకత, ఏకాగ్రత ఉంటే తప్ప ఈ కళ నేర్చుకోవడం అసాధ్యం. ప్రస్తుతం కరీంనగర్‌లో మొత్తంగా 150 మంది మాత్రమే సిల్వర్ ఫిలిగ్రీ నిపుణులు ఉన్నారు.

వీరంతా సిఫ్కా కింద ఒకే గొడుగు కింద తమ వెండి నగిషీ పనులను కొనసాగిస్తున్నారు. జిల్లాకే సొంతమైన ఈ కళను ఇతరులెవరూ తస్కరించకుండా ఉండేందుకు ఇక్కడి ఫిలిగ్రీ కళాకారులు దీనిపై పేటెంట్ హక్కులు కూడా పొందారు. ఇక్కడ తయారయ్యే ఫిలిగ్రీ వస్తువులను దేశవిదేశాల నుంచి వచ్చే వారికి ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా బహుకరిస్తుంటారు. రాష్ట్రానికి ఎవరు వచ్చినా రాష్ట్రప్రభుత్వం ఇక్కడే ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చిన ఫిలిగ్రీ వస్తువులను తయారు చేయిస్తుంటుంది. తాజాగా ఫిలిగ్రీ కళాకారుడు భారత ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకోనున్నారు.

గతంలో పెళ్లి వేడుకల సందర్భంగా ఆడపిల్లను పల్లకిలో ఊరేగించడం ఆనవాయితీగా ఉండేది. మారుతున్న కాలంతో పాటు ఆ విధానం కూడా కనుమరుగయ్యింది. ఈ క్రమంలో ఆనాటి సాంప్రదాయాన్ని గుర్తు చేసేందుకు రెండున్నర కిలోల వెండితో పల్లకిని రూపొందించి ఫిలిగ్రీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గద్దె అశోక్ తయారు చేశారు. ఆ పల్లకీని జాతీయ చేతికళల అభివృద్ధి సంస్థకు పంపించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పలు సంస్థల పోటీని గుర్తించి కరీంనగర్‌ ఫిలిగ్రీకి 2018లో జాతీయ అవార్డు దక్కిందని సంస్థ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఒకప్పుడు ఆడపిల్లలను పెళ్లి చేసేటప్పుడు పల్లకిలో ఊరేగించేవారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రావాలని.. అందరికీ ఈ పల్లకి గురించి తెలియాలని ఈ వెండి ఫిలిగ్రీ పెళ్లి పల్లకిని ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. ఫిలిగ్రీ కళతో తయారు చేసిన ఈ పెళ్లి పల్లకిని ప్రతి పెళ్లిలో ఇచ్చుపుచ్చుకునే విధంగా చేయడానికి ముందుకొచ్చాను. ఇందుకుగానూ 2018లో జాతీయ అవార్డు వరించింది. - గద్దె అశోక్‌, ఫిలిగ్రీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి

ఇప్పటికే రెండు సార్లు జాతీయ అవార్డులను రాష్ట్రపతి చేతులమీదుగా అందుకొని మూడోసారి అందుకోనున్నారు. అదే సందర్భంలో అతి తక్కవ కాలంలో ఎక్కువ మంది కళాకారులకు ఉపాధిని కల్పించిన సంస్థగా యునెస్కో నుంచి బెస్ట్ ఎంప్లాయిమెంట్ జనరేటర్ ఆవర్డ్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కైవసం చేసుకోవడం గమనార్హం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.