ధాన్యం సక్రమంగా కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తాలు పేరిట కొనుగోలు చేయకపోవటంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. వరిధాన్యం తగులబెట్టి వీణవంక ప్రధాన రహదారిపై బైఠాయించారు. మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు.
తాలు, చెత్త పేరుతో సరిగా కొనుగోలు చేయటం లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసేంతవరకు కదిలేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకుల వైఖరికి నిరసనగా రైతులు ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టారు.
ఇదీ చదవండి: కొనుగోలు చేయట్లేదని ధాన్యం తగలబెట్టి నిరసన