కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్‌తో ఈటీవీ-ఈనాడు నిర్వహించిన 'ఫోన్ ఇన్' కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నగరంలోని నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలు నేరుగా కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డికి తెలియజేశారు. ఫోన్ ఇన్ కార్యక్రమానికి నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి ఫోన్ ద్వారా తెలుసుకున్న సమస్యలను వెంటనే ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కేవలం గంట సేపట్లో 32 మంది తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, వీధిదీపాలు, ఖాళీ స్థలాల్లో నీరు నిలవడం లాంటి సమస్యలు అధికంగా వచ్చాయని... వాటన్నింటిని కేవలం వారం రోజుల్లో పరిష్కరిస్తామని కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: 48,500 దరఖాస్తులు... రూ.970 కోట్లు!