ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా హుజురాబాద్ సీఐ వాసంశెట్టి మాధవి తన గొప్ప మనసును చాటుకున్నారు. పదకొండు మంది అనాథ బాలికలను గుర్తించి వారికి దుస్తులను పంపిణీ చేశారు. హుజూరాబాద్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బాలికలకు ఏసీపీ శ్రీనివాసరావు దుస్తులను అందజేశారు.
అనాథ బాలికలకు మరింత చేయూతనందిస్తానని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతానని సీఐ మాధవి స్పష్టంచేశారు. గొప్ప మనసు చాటుకున్న సీఐని ఏసీపీ శ్రీనివాసరావు అభినందించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారీ అగ్నిప్రమాదం..