కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటంతా వర్షాలతో నీటిపాలైందని ఎమ్మెల్యే అన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వ్యవసాయ అధికారులు.. క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
- ఇదీ చదవండి : టోలీచౌకి నదీమ్ కాలనీలో మంత్రి కేటీఆర్ పర్యటన