కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలులో ప్రతి 40 కిలోల బస్తాకు ఆరు కిలోలు తరుగు పేరిట వసూలు చేస్తున్నారని నిరసనకు దిగారు. మొదట్లో రెండు కిలోలు తరుగు పేరిట తీసుకున్నారని తాజాగా ఆరు కిలోలు కోత విధించటం అన్యాయమని వాపోయారు.
కరీంనగర్ - మంచిర్యాల రహదారిపై బైఠాయించటంతో వాహనాలు నిలిచిపోయాయి. భౌతిక దూరాన్ని పాటిస్తూ రైతులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. గంట సేపు ఆందోళన చేయటంతో తహసీల్దార్ సరిత, ఎస్సై వంశీకృష్ణ చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. ధాన్యంలో కోత విధించకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనివల్ల రైతులు ఆందోళన విరమించారు.