Tharun Chug on police: రాష్ట్ర పోలీసులు కేసీఆర్ వర్కర్లుగా పనిచేస్తున్నారని... భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ ఆరోపించారు. కరీంనగర్ జైలులో ఉన్న భాజపా నేతలను పరామర్శించిన తరుణ్‌చుగ్... అరెస్టయిన నేతలకు భాజపా అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు కేసీఆర్ చేతిలో కీలు బొమ్మలా మారారని తరుణ్‌చుగ్ ఆరోపించారు. భాజపా నేతల అరెస్టులను ఖండిస్తున్నామన్న ఆయన... అక్రమ కేసులతో పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
హైకోర్టు తీర్పుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. కొవిడ్ నిబంధనల పేరుతో పోలీసులు బండిసంజయ్‌ను ఉగ్రవాదిలా చూశారు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న సంజయ్‌పై దాడిని ఖండిస్తున్నాం. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి. వారంతా కేసీఆర్ వర్కర్లలా పనిచేస్తున్నారు. ---- తరుణ్ చుగ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్
జీవో 317 కు వ్యతిరేకంగా ఈ నెల 3న కరీంనగర్లో బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బండి సంజయ్‌తో పలువురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిన్న.. బండి సంజయ్‌ను విడుదల చేశారు. ఈ మేరకు కరీంనగర్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కార్పొరేటర్లు, కార్యకర్తలను.. తరుణ్ చుగ్, భాజపా జనరల్ జాతీయ కార్యదర్శి రాజా సింగ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ ప్రేమేందర్ రెడ్డి పరామర్శించారు.
ఇదీ చదవండి: రామకృష్ణ విడుదల చేసిన వీడియో తీవ్ర క్షోభకు గురిచేసింది: వనమా