ETV Bharat / state

మున్సిపల్​ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్​లో భాజపా నిరసన

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూరేలా అప్రజాస్వామికంగా తెరాస ప్రభుత్వం మున్సిపల్​ చట్టాన్ని ఆగమేఘాల మీద అసెంబ్లీ మండలి సమావేశంలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ కరీంనగర్​లో భాజపా నాయకులు నిరసన చేపట్టారు.

author img

By

Published : Oct 13, 2020, 5:31 PM IST

bjp protest at karimnagar against municipal act
మున్సిపల్​ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్​లో భాజపా నిరసన

కరీంనగర్​ జిల్లా కేంద్రంలో భాజపా నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూరేలా తెరాస ప్రభుత్వం ఆగమేఘాలపై అసెంబ్లీలో మున్సిపల్​ చట్టాన్ని ప్రవేశపెట్టిందని భాజపా నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్​ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తున్న కమలం శ్రేణులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్​ విధానాన్ని రద్దు చేసి వెంటనే లబ్ధిదారులు అందరికీ రెండు పడక గదుల ఇళ్లను అందజేయాలని భాజపా నేతలు డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండిః అరెస్టులు, లాఠీఛార్జీలే తెరాస విధానమా : భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.