ETV Bharat / state

కరోనా నిబంధనలతో బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడపడుచులకు ఓ ఉత్సవం లాంటిది. మహిళలంతా ఒకచోట చేరి ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది కరోనా వల్ల ఇళ్లవద్దనే సంబరాలు చేసుకోవాల్సి వస్తోంది. కరీంనగర్‌లో కరోనా నిబంధనల వేళ బతుకమ్మ సంబరాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి.

Bathukamma sanbaralu conducted at houses due corona virus in karim nagar
కరోనా నిబంధనలతో బతుకమ్మ సంబరాలు
author img

By

Published : Oct 17, 2020, 7:37 PM IST

Updated : Oct 17, 2020, 9:48 PM IST

తెలంగాణ వ్యాప్తంగా ఓ ఉత్సవంలా జరుపుకునే బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్‌లోని మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లతో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ ఏడాది కరోనా నిబంధనలతో బతుకమ్మ ఆడాల్సి రావడం ప్రత్యేకతను సంతరించుకుంది.

ప్రతి సంవత్సరం చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి బతుకమ్మ పండుగను అట్టహాసంగా జరుపుకునేవారు. వీధుల్లో ఎక్కడు చూసినా బతుకమ్మ ఆడుతూ కనిపించేవారు. కానీ ఈ సారి మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ ఆడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఇళ్లవద్దనే బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నట్లు మహిళలు తెలిపారు. వచ్చే సంవత్సరం ఆనందంగా జరుపుకుంటామని మహిళలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కరోనా నిబంధనలతో బతుకమ్మ సంబరాలు

ఇదీ చదవండి:బతుకమ్మపై కరోనా ప్రభావం.. ఆడేందుకు భయపడుతున్న మహిళలు

Last Updated : Oct 17, 2020, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.