కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి గునుగుపూలు సేకరించి గౌరమ్మలను అందంగా పేర్చారు. వాడవాడలా వేదికలు ఏర్పాటు చేసి బతుకమ్మ ఆడారు. సాంప్రదాయ పాటలతో గ్రామాల్లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.
చొప్పదండి, గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమ్యాల మండలాల్లో మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. రామడుగు మండలం గోపాల్ రావుపేటలో ఎస్సై గొల్లపల్లి అనూష విధినిర్వహణలోనూ బతుకమ్మ ఆడారు.
ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబురాలు