ETV Bharat / state

మద్యం మత్తు.. మనస్తాపం.. కౌన్సెలింగ్​

author img

By

Published : Oct 1, 2020, 9:20 PM IST

కరీంనగర్​ జిల్లా ఆబాది జమ్మికుంటలో ఓ వ్యక్తి హల్​చల్​ చేశాడు. మద్యం మత్తులో విద్యుత్​ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

karimnagar news
మద్యం మత్తు.. మనస్తాపం.. కౌన్సెలింగ్​

మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్​చల్​ చేశాడు. విద్యుత్తు స్తంభం ఎక్కి ఆత్మహత్యకు పాల్పడుతానని బెదిరించాడు. ఈ ఘటన కరీంనగర్​ జిల్లాలో జరిగింది.

రంగాపూర్​కు చెందిన తునికి శ్రీనివాస్​.. ఆబాది జమ్మికుంటలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ వారి మధ్య గొడవ తలెత్తింది. మనస్తాపానికి గురైన శ్రీనివాస్​ అక్కడే ఉన్న విద్యుత్​ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. స్థానికులు వారించినా వినకుండా స్తంభం ఎక్కాడు. స్థానికుల సమాచారంతో విద్యుత్​ సరఫరాను నిలిపివేశారు.. అధికారులు. సమాచారం అందుకున్న సీఐ సృజన్​రెడ్డి ఘటనా స్థలికి చేరుకున్నారు. శ్రీనివాస్​తో మాట్లాడారు. స్థానికుల సాయంతో విద్యుత్​ స్తంభం నుంచి శ్రీనివాస్​ను కిందకు దింపారు. అనంతరం పోలీస్​ స్టేషన్​కు తరలించి కౌన్సెలింగ్​ ఇచ్చారు.

మద్యం మత్తు.. మనస్తాపం.. కౌన్సెలింగ్​

ఇవీచూడండి: డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి ముమైత్‌ఖాన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.