Unique Holi tradition in Kamareddy: కామారెడ్డి జిల్లాలో హోలీ పండుగ రోజు వింత ఆచారం కొనసాగుతోంది. గాంధారి మండలం నేరల్ తండాలో ఏటా హోలీ రోజు రంగులు చల్లుకుంటూ ఒకరినొకరు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పెళ్లి అయిన మహిళలు పెళ్లి కాని యువతీ యువకులను కర్రలతో కొట్టడం సంప్రదాయంగా వస్తోంది.
తండాలోని వారంతా కలిసి రంగులు చల్లుకున్నారు. వాళ్ల సంప్రదాయం ప్రకారం మహిళలు పాటలు పాడుకుంటూ వరుస అయిన అందరినీ కర్రలతో కొడుతుంటారు. కొందరూ వాళ్ల నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా తండాలో కోలాహలంగా రంగోలీ జరుపుకున్నారు.
చిన్నా పెద్దా అంతా రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాలు చేసుకున్నారు. పాటలు పాడుకుంటూ నృత్యాలు చేస్తూ సంతోషంగా హోలీ జరుపుకున్నారు.
ఇదీ చదవండి : జంబలకడిపంబ హోలీ.. మగాళ్లు ఆడాళ్లుగా మారిపోతారు!