అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో పూర్వ ప్రాథమిక విద్యతోపాటు సంపూర్ణ అభివృద్ధి జరుగుతోంది. శరీరక మానసిక, ప్రజ్ఞ, ఉద్వేగ, భాష, సాంఘిక అభివృద్ధి సాధ్యమవుతోంది. అంగన్వాడీ టీచర్లు బాధ్యతాయుతంగా పనిచేస్తూ కేంద్రాలను ఆహ్లాదకరంగా మార్చేశారు. బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పెద్ద కొడప్గల్ మండలాల్లో 206 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.
ఎప్పటికప్పుడు శిక్షణ
అంగన్వాడీ కేంద్రాల్లో మూడు సంవత్సరాల నుంచి ఐదేళ్ల పిల్లల కోసం పలు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వివిధ రకాల ఆట వస్తువులు ఇస్తున్నారు. కథల పుస్తకాలు, బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. చిన్నారుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఐసీడీఎస్ అధికారులు అంగన్వాడీ టీచర్లకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తున్నారు. కేంద్రాల్లో పిల్లలకు జంతువులు, పక్షులు, పండ్లు వంటి వస్తువులను పేర్లతో పరిచయం చేసే ఆట సామగ్రి ఉన్నాయి.
పజిల్స్
అట్టముక్కలతో తయారు చేసిన పజిల్స్ నేర్పిస్తున్నారు. పిల్లలకు తెలుగు, ఆంగ్లం అక్షరాలతో కూడిన కార్డులు ఇచ్చారు. ఒక్కొక్కరికి ఇస్తూ అక్షరాలు నేర్పించడానికి సులువైన పద్ధతి అమలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: తొలి రఫేల్ యుద్ధ విమానానికై ఫ్రాన్స్‌కు రక్షణమంత్రి