Special Focus On Kamareddy Constituency : కామారెడ్డి బరిలో ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు.. ఈసారి ఎన్నికకు దూరమయ్యారు. కామారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు గత 34 సంవత్సరాలుగా.. ఎవరో ఒకరు లేదా ఇద్దరు బరిలో నిలుస్తూ వచ్చారు. గెలుపు ఓటములను పక్కన పెడితే మారిన రాజకీయ సమీకరణాలతో ఆ ఇద్దరు నాయకులు కామారెడ్డి ఎన్నికల్లో ఈసారి పోటీ చేయడం లేదు.
Kamareddy Elections 2023 : నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ తరఫున షబ్బీర్ అలీ పోటీచేస్తుండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (CM KCR) కామారెడ్డికి ఆహ్వానించి గంప గోవర్ధన్ (MLA Gampa Govardhan) ఎన్నికలబరి నుంచి తప్పుకున్నారు. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గంప గోవర్ధన్, షబ్బీర్ అలీ గత 29 సంవత్సరాలుగా పోటీపడుతూనే ఉన్నారు. 1989 ఎన్నికల్లో తొలి విజయం అందుకున్న షబ్బీర్ అలీ.. మంత్రిగా పనిచేశారు. అనంతరం 1994ఎన్నికల్లో గంప గోవర్ధన్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి.. షబ్బీర్ అలీపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఆచితూచి అడుగేస్తున్న విపక్షాలు - ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి
1999లో గంప గోవర్ధన్‌ను కాదని యూసుఫ్ అలీకి ఇవ్వడంతో పోటీ చేయలేకపోయారు. యూసుఫ్ అలీ చేతిలో.. షబ్బీర్ అలీ ఓటమి పాలయ్యారు. 2004 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా కామారెడ్డి టికెట్‌ను కమలం పార్టీకి కేటాయించడంతో మురళీధర్ గౌడ్ పోటీచేయగా.. ఆయనపై షబ్బీర్ అలీ విజయం సాధించి రెండోసారి మంత్రి పదవి చేపట్టారు. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి గంప గోవర్ధన్.. కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీ చేయగా.. గంప గోవర్ధన్ గెలిచారు.
CM KCR Contesting in Kamareddy : 2012లో గంప గోవర్ధన్ టీడీపీకి రాజీనామా చేసి.. బీఆర్ఎస్‌లో(టీఆర్ఎస్) చేరగా.. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో షబ్బీర్ అలీ దూరంగా ఉన్నారు. 2014, 2018లో గంప గోవర్ధన్ బీఆర్‌ఎస్(టీఆర్ఎస్) నుంచి పోటీ చేయగా.. షబ్బీర్ అలీపై (Congress Leader Shabbir Ali) వరుస ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రత్యర్థులుగా నిలిచిన ఆ ఇద్దరిలో ఒక్కరూ కామారెడ్డి స్థానం నుంచి బరిలో లేకుండా ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా గంప గోవర్ధన్ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ముందుండి నడిపిస్తున్నారు.
Revanth Reddy Contesting in Kamareddy : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (PCC President Revanth Reddy) కామారెడ్డి నుంచి బరిలో ఉండటంతో షబ్బీర్ అలీ.. నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం పని చేయాలని ఇప్పటికే అనుచరులు, కార్యకర్తలకు షబ్బీర్ అలీ దిశానిర్దేశం చేశారు. త్వరలో ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. రేవంత్‌రెడ్డి బరిలో ఉండటంతో కామారెడ్డిలో ఎవరూ విజయం సాధిస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయాలి? అసలు అఫిడవిట్ అంటే ఏమిటి?