ETV Bharat / state

'కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ మైలురాయిగా నిలుస్తుంది' - శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో స్థానిక ప్రజాప్రతినిధులతో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అవసరాలను గుర్తించి పనిచేసేదే నిజమైన ప్రభుత్వమని తెరాసను కొనియాడారు.

pocharam-srinivas-meeting-in-r-and-b-guest-house-in-kamareddy-district
'కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ మైలు రాయిగా నిలుస్తుంది'
author img

By

Published : Jun 1, 2020, 10:31 PM IST

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరేళ్లకాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో స్థానిక ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా.. రాష్ట్ర ప్రజలకు పోచారం శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అవసరాలను గుర్తించి పనిచేసేదే నిజమైన ప్రభుత్వమన్నారు.

బంగారు తెలంగాణ :

  • దేశ చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ మైలు రాయిగా నిలుస్తుందని పోచారం ధీమా వ్యక్తం చేశారు. 30 ఏళ్లలో చేయలేని ప్రాజెక్ట్ పనులను మూడేళ్లలో చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు.
  • కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయలలో.. ఇప్పటి వరకు ఒక్క రూపాయ కూడా పేదలకు చేరలేదని స్పష్టం చేశారు.
  • రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు.. నియంత్రిత సాగు విధానం అమలు చేస్తే.. ప్రతి పక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.
  • రాష్ట్రంలో మూడున్నర కోట్ల జనాభాలో 60 లక్షల మంది రైతులే ఉన్నారని, వీరిని చైతన్య చేస్తూ.. డిమాండ్ ఉన్న పంటలు సాగు చేస్తే కర్షకులకు తిరుగుండదని స్పష్టం చేశారు.
  • రైతు రాజుగా ఉండాలని కోరుకుంటున్నామని.. ఆరోజు తెరాస హయాంలోనే వస్తుందని పోచారం వెల్లడించారు.
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాగు విస్తీర్ణం పెరిగి.. నియంత్రిత సాగు విధానం అవలంబిస్తే సంవత్సరానికి రెండు లక్షల కోట్ల పంట రైతుల చేతికి వస్తుందన్నారు.

లాక్ డౌన్ వల్ల తగ్గిన ఆదాయం

కరోనా వల్ల నెలకు రూ. 15 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా.. ఏప్రిల్ నెల మాసానికి రూ.150 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. ప్రభుత్వం ముందుచూపు వల్లే రాష్ట్రంలో మృతుల సంఖ్య తగ్గిందన్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్,ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, సురేందర్, కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ జాహ్నవి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: జూన్ 2న తెలంగాణ డిమాండ్స్ డే: సీపీఐ కార్యదర్శి భూమన్న

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.