కామారెడ్డి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. పెండింగ్ వేతనాలు ఇప్పించాలంటూ ఇవాళ ఉదయం నుంచి పనులు విరమించి ధర్నాకు దిగారు. విలీన గ్రామాల కార్మికులకు గత 2 నెలలగా జీతాలు రావడంలేదని వాపోయారు.
జీతమిచ్చేవరకు పనికిపోం...
నీటి సరఫరా కార్మికులకు ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలని కోరారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు, అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించినా... సెలవన్నదే లేకుండా పనిచేస్తున్న తమకు కనీసం జీతం ఇవ్వకపోవడం దారుణమని వాపోయారు. పెండింగ్ జీతాలు మంజూరు చేసేవరకు విధులకు హాజరయ్యేది లేదని స్పష్టంచేశారు.
- ఇదీ చూడండి : రాష్ట్రంలో నాలుగుకు చేరిన కరోనా కేసులు