ETV Bharat / state

రైతు సంక్షేమమే సర్కారు లక్ష్యం: గంప గోవర్ధర్ - రైతు వేదికలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్

కామారెడ్డి నియోజకవర్గంలో 23 రైతు వేదికల నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్​, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శంకుస్థాపన చేశారు. ఈ వేదికల ద్వారా రైతులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవచ్చని సూచించారు. తెరాస ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటోందని పేర్కొన్నారు.

gampa govarhdhan
gampa govarhdhan
author img

By

Published : Jul 1, 2020, 2:11 PM IST

విత్తనం విత్తినప్పటి నుంచి పంటను పండించి అమ్ముకునే వరకు రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివిధాలా అండగా ఉంటున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 5 కోట్ల 6 లక్షల రూపాయలతో నిర్మించనున్న 23 రైతు వేదికల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మాచారెడ్డి మండలం భవానిపేట్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులకు కలెక్టర్ శరత్​తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రోడ్డు పక్కన మొక్కలు నాటారు.

పంట వేసే సమయంలో పెట్టుబడి సాయం అందించి పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ప్రతి క్లస్టర్​కు 22 లక్షల రూపాయలతో ఒక రైతు వేదికను ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు సంబంధించిన నిర్ణయాలు ఈ వేదికల ద్వారా తీసుకోవచ్చు.

-గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్

ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.