కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కల్యాణి గ్రామానికి చెందిన కాశీరాం అతని బావమరిది రఘుపతి సమీప వాగులో గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం వినాయక పూజ కోసం ఆకులు, పూలు తేవడానికి వెళ్లి ఎంతకీ తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన బంధువులు గ్రామ పరిసరాల్లో వెతికారు. భారీ వర్షం కారణంగా కల్యాణి వాగు రోడ్డుపై నుంచి పారడం వల్ల గల్లంతయినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాగు సమీపంలో కాశీరాం మృతదేహం లభించగా... అతని బావమరిది రఘుపతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి : 'అప్పట్లో కేసీఆర్ కంటే వారిద్దరే ఎక్కువ కష్టపడ్డారు'