కరోనా బారినపడి ఇరవై రోజుల వ్యవధిలోనే తండ్రీకొడుకులు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. వారిని బతికించుకోవడం కోసం కుటుంబ సభ్యులు సుమారు 15 లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది.
జిల్లాలోని బిక్నూరు మండల కేంద్రానికి చెందిన అల్లాడి సుధాకర్ (47), అతడి తండ్రి సుదర్శన్ (68) కొంత కాలం క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చి స్థిరపడ్డారు. సుదర్శన్ కరోనా బారినపడి 20 రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. తాజాగా సుధాకర్ మహమ్మారి కాటుకు బలయ్యాడు. ఇరవై రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇదీ చదవండి: rtc timings: లాక్‌డౌన్ సడలింపు సమయం... ప్రయాణికుల అవస్థలు