కామారెడ్డి జిల్లాలోని 31వ వార్డులో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంలో వార్డులో పచ్చదనం పెరగాలని కౌన్సిలర్ పాక జ్ఞానేశ్వరి గంగపుత్ర పలు రకాల మొక్కలు పంపిణీ చేశారు. స్థానిక మహిళలకు పెద్ద ఎత్తున పండ్ల, తులసి మొక్కలు పంపిణీ చేశారు. స్వచ్ఛమైన గాలి కోసం, వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు వార్డులోని ప్రజలంతా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కౌన్సిలర్ స్పష్టం చేశారు.
చెట్లు ఉంటేనే సమృద్ధిగా వర్షాలు...
చెట్లు ఎక్కువగా ఉంటే వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కార్యదర్శి పాక రవిప్రసాద్ గంగపుత్ర తెలిపారు. నానాటికీ పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించాలంటే పెద్ద మొత్తంలో చెట్లు నాటడమే సరైన మార్గమని వెల్లడించారు. కార్యక్రమంలో హరితహారం ఇన్ఛార్జి షాహిద్ హుస్సేన్, ఆర్వో స్వాతి, రాజు, దీపక్, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.