ETV Bharat / state

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై కలెక్టర్‌ క్లారిటీ.. ఏం చెప్పారంటే?

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై అన్నదాతలు అనవసరంగా అపోహ పడుతున్నారని జిల్లా పాలనాధికారి జితేష్ పాటిల్ పేర్కొన్నారు. ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని.. ఇంకా ఫైనల్ కాలేదని వివరణ ఇచ్చారు. ఇండస్ట్రియల్‌ జోన్‌లో ఉన్నందువల్ల భూములు పోతాయని రైతులు భయపడొద్దని సూచించారు. మాస్టర్ ప్లాన్‌పై ఇప్పటి వరకు 1,026 అభ్యంతరాలు వచ్చాయని.. గడువు పూర్తయిన తర్వాత మార్పులు, చేర్పులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

జితేష్ పాటిల్
జితేష్ పాటిల్
author img

By

Published : Jan 7, 2023, 3:41 PM IST

Updated : Jan 7, 2023, 4:25 PM IST

కామారెడ్డి పురపాలక సంఘం నూతన బృహత్‌ ప్రణాళికపై రైతుల ఆందోళన దృష్ట్యా ఆ జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ పాటిల్‌ ముసాయిదాపై స్పష్టతనిచ్చారు. మాస్టర్ ప్లాన్‌ ముసాయిదా దశలో ఉందని.. ఇంకా ఫైనల్‌ కాలేదని ఆయన వెల్లడించారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటామన్న ఆయన.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఈ క్రమంలోనే రైతుల భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమే అని కలెక్టర్‌ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించామని తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌పై ఇప్పటి వరకు 1,026 అభ్యర్థనలు వచ్చాయని.. జోన్‌ ప్రకటించినంత మాత్రాన భూసేకరణ జరగదని చెప్పారు. ఇంకా అనేక ప్రక్రియలు ఉన్నాయని.. ఇండస్ట్రియల్‌ జోన్‌లో ఉన్నందువల్ల భూములు పోతాయని అన్నదాతలు భయపడొద్దని సూచించారు.

దీనిపై ఎవరైనా సూచనలు ఇవ్వొచ్చని ఇప్పటికే ప్రకటించామన్న కలెక్టర్‌.. అభ్యర్థనల స్వీకరణకు ఈ నెల 11 వరకు సమయం ఉందని స్పష్టం చేశారు. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భూములు పోతాయని కొందరు పదే పదే చెబుతూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆయన.. ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రస్తుతం ఇచ్చింది ముసాయిదా మాస్టర్‌ ప్లాన్ మాత్రమే. అందులో మార్పులు, చేర్పులు జరుగుతాయి. రైతుల అభ్యర్థనలను నమోదు చేసుకుంటాం. ఎవరైనా సూచనలు ఇవ్వవచ్చని ఇప్పటికే ప్రకటించాం. 60 రోజుల్లో సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని ఫ్లెక్సీలు కూడా వేశాం. ఇప్పటి వరకు 1026 అభ్యర్థనలు వచ్చాయి. భూములు పోతాయని రైతులు ఆందోళన చెందనక్కర్లేదు. భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమే. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాం. - జితేష్‌ పాటిల్, కామారెడ్డి కలెక్టర్

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై కలెక్టర్‌ క్లారిటీ.. ఏం చెప్పారంటే?

ఇవీ చూడండి..

మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టుకు కామారెడ్డి రైతులు

'బువ్వ పెట్టే భూమి పోతే మా బతుకులెట్లా సారూ..?'

Last Updated : Jan 7, 2023, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.