జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ ఎత్తిపోతల పథకం ద్వారా బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆర్డీఎస్ కాల్వకు నీటిని విడుదల చేశారు. కాల్వలను ఆధునీకరించకపోవడం వల్ల జులకల్ శివాలయం వద్ద ఆర్డీఎస్ కెనాల్‌కు గండి పడింది. కాల్వ తెగిపోవడం వల్ల నీరు వృథాగా పొలాల్లోకి పారుతోంది. ఆర్డీఎస్ కాల్వలో పూడిక తీయకపోవడం వల్ల నీరు ముందుకు పోవడం లేదని.. అందువల్లే కాల్వ తెగిపోయిందని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని బాగుచేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ: కేసీఆర్