జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ మానోపాడు మండలం నారాయణపురం గ్రామంలో ఆధ్యాత్మిక యోగి శ్రీ శ్రీ బాలయోగి శివనారాయణ స్వామి మృతి చెందారు. 14 ఏళ్ల వయస్సులో ఆధ్యాత్మికత వైపు మళ్లిన స్వామి... 76 ఏళ్లుగా అదే చింతనలో జీవనం కొనసాగించారు.
నాటి నుంచి పండ్లు, పాలనే ఆహారంగా స్వీకరించేవారు. ఏటా ఫిబ్రవరి నెలలో శివనారాయణ స్వామి జాతర జరుగుతుంది. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలే నుంచే కాకుండా కర్ణాటక భక్తులు వచ్చేవారు. స్వామి మరణంతో భక్తులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
ఇదీ చదవండి: '2021-22 విద్యా సంవత్సరం కాలపట్టిక ఖరారు'