దిల్లీ కేంద్రంగా పనిచేసే స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ (ఎస్జీవో) సామాజిక సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న తుంగభద్ర పుష్కరాల్లో ఘాట్ల వద్ద భక్తులకు సేవలు అందిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతోంది. తెలంగాణలో దాదాపు 300 మంది వాలంటీర్లు వివిధ సేవ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.
పుష్కరఘాట్ల వద్ద క్యూలైన్లలో భక్తులకు సూచనలు ఇస్తూ అదుపు చేస్తున్నారు. అటు పోలీస్‌శాఖకు, ఆలయ సిబ్బందికి సహకారం అందిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే పిల్లల్లో సేవాగుణం, ధైర్యసాహసాలు అలవడేలా ఉత్తమ పౌరులను అందించడమే తమ కర్తవ్యమని ఎస్జీవో అసిస్టెంట్ కమిషనర్ రాజ్‌కుమార్ వెల్లడించారు. అమ్మవారి సన్నిధిలో పుష్కరసేవలో పాల్గొనడం ఆనందంగా ఉందని వాలంటీర్లు తెలిపారు.