ETV Bharat / state

FAKE SEEDS: నకిలీ విత్తనాల దందాపై అధికారుల ఉక్కుపాదం

నకిలీ విత్తన దందాపై పోలీసులు, అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. నిషేధిత, కల్తీ విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులను పట్టుకుని జైలు ఊచలు లెక్కించేలా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ.. నకిలీ విత్తనాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నాయి.

నకిలీ విత్తనాల దందాపై అధికారుల ఉక్కుపాదం

author img

By

Published : Jun 8, 2021, 6:38 AM IST

నకిలీ విత్తనాల దందాపై అధికారుల ఉక్కుపాదం

నకిలీ విత్తన దందాపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తూ అక్రమార్కులను పట్టుకుంటున్నారు. కోట్లాది రూపాయల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ దందా చేస్తున్న వారిని పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తున్నారు. పలువురిపై పీడీ యాక్టు ప్రయోగిస్తున్నారు.

మూడ్రోజుల క్రితం జోగులాంబ గద్వాల జిల్లా రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రమ్య ఇండస్ట్రీస్‌లో 3,434 కిలోల నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. బాధ్యులైన బండ్ల రాజశేఖర్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. నకిలీ దందాతో సంబంధమున్న వారిని వదిలేది లేదని ఎస్పీ రంజన్‌ రతన్‌ హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు 10 వేల కిలోలకు పైగా నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి శివారులో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.13 లక్షల విలువ చేసే 3,238 ప్యాకెట్ల నకిలీ మిరప విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఏపీ నుంచి మహబూబాబాద్‌ జిల్లాకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారుల బృందం దాడులు చేపట్టిందని తెలిపారు. మరిపెడలో అక్రమంగా విక్రయిస్తున్న నిషేధిత మిర్చి విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతిలేని రూ.4 లక్షల విలువైన విత్తన ప్యాకెట్లను పట్టుకొని ఇద్దరిని అరెస్టు చేశారు.

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో నకిలీ విత్తనాలు తరలిస్తున్న ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిషేధిత, కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఎరువులు, విత్తన వ్యాపారులతో డీఎస్పీ సమావేశమయ్యారు. నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు, మందులు అమ్మితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు.

ఇదీ చూడండి: fake mirchi seeds:రూ.13 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.