జోగులాంబ గద్వాల జిల్లా వేణిసోంపురం ఫుష్కరఘాట్లో ప్రమాదవశాత్తు మునిగిపోతున్న ఓ మహిళను పోలీసులు కాపాడారు. గద్వాల పట్టణానికి చెందిన ఓ మహిళ తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా ఐజ మండలంలోని వేణిసోంపురం పుష్కరఘాట్‌కు వచ్చింది.
స్నానం కోసం ఘాట్‌లోకి దిగింది. లోతు ఎక్కువగా ఉండటం వల్ల జారిపోయి నీళ్లలోకి పడిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు హుటాహుటిన నదిలోకి దూకి మహిళను కాపాడారు. ప్రమాదం తప్పడం వల్ల భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీచూడండి: ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. మొదలైన తాయిలాల పర్వం