జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గుందిమల్ల గ్రామంలో ఆదివారం కురిసిన వర్షానికి చాలా ఇళ్లు అతలాకుతలమయ్యాయి. గాలివాన వల్ల నష్టపోయిన కుటుంబాలను ఎమ్మెల్యే అబ్రహం పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా పరిహారం అందించారు. ఇది తాత్కాలిక పరిహారం మాత్రమేనని... కలెక్టర్‌తో మాట్లాడి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సాయమందిస్తామని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండిః శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్