ఐదవ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ బాల బ్రహ్మమేశ్వర స్వామిని సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కూతురు ఎమ్మెల్సీ కవిత, కోడలు నీలిమ, మంత్రి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈవో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయ ఆవరణలో నిర్వహించిన సహస్ర గంటాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం కలశాలతో అమ్మవారి ఆలయం చేరుకొని... అభిషేకం నిర్వహించారు.
వసంత పంచమి సందర్భంగా అమ్మవారి నిజరూపాన్ని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి ఆలయానికి చేరుకొని అభిషేకం నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇదీ చూడండి: మూడు లక్షల మొక్కలు నాటుతాం: మంత్రి సత్యవతి