ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాలకు లక్షా 85 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1054 అడుగులు కాగా ప్రస్తుతం 1044 అడుగులకు చేరింది. ఇప్పటికే జలాశయం నిండుకుండలా మారడం వల్ల దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పవర్ హౌస్ ద్వారా సుమారు 20 నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు కృష్ణా నదిలోకి వదిలారు. ఇక నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలకు, రామన్‌పాడు ప్రాజెక్టులకు కూడా నీటిని వదులుతున్నారు.
ఇవీచూడండి: నీటి వివాదాల బిల్లుకు లోక్‌సభ ఆమోదం