అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. నవాబుపేట గ్రామంలో సమాచార హక్కు చట్టం రక్షణ వేదికగా గ్రామపంచాయతీ బృందం నేను అవినీతికి వ్యతిరేకం అంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ అధికారులు ఏ పని చేయాలన్నా లంచాలు ఇవ్వనిదే ఫైల్ కదలడం లేదని.. ప్రభుత్వ కార్యాలయాలను అవినీతి కబళిస్తోందని సర్పంచ్ సాయిసుధ అన్నారు.
అవినీతిని నిర్మూలించేందుకు నా వంతు కృషి చేస్తానని, నిబద్ధతతో ప్రజలలో చైతన్యం తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేశారు. అవినీతిని పాతరేయ్.. అభివృద్ధికి బాటలు వెయ్ అని సర్పంచ్ సాయిసుధ పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: అవినీతి రహిత సమాజం కోసం 5కే వాక్