ETV Bharat / state

'ఒకరికి ఒకరు తోడై... మృత్యు ఒడిలో ఒదిగారు' - చిట్యాలలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. అందిరికీ పెళ్లి చేసి బాధ్యత పూర్తి చేశారు. జీవితాన్ని ధారపోసి పెంచి పెద్ద చేసిన కుమారుడు తమను భారంగా భావించడం ఆ ముసలి గుండెలు తట్టుకోలేకపోయాయి. ఆప్యాయతకు దూరమై బతుకు బండినీడ్చలేమని అర్థం చేసుకున్నారు. వాళ్లకు భారం కాకూడదని తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు. యాభై ఏళ్లు కలిసి బతికిన ఆ వృద్ధ దంపతులు కలిసే మృత్యుఒడిలో ఒదిగారు.

old couple committed suicide due to son and daughter in law at chityala in jayashankar bhupalpally district
'ఒకరికి ఒకరు తోడై... మృత్యు ఒడిలో ఒదిగారు'
author img

By

Published : Jan 18, 2020, 10:58 AM IST

'ఒకరికి ఒకరు తోడై... మృత్యు ఒడిలో ఒదిగారు'

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో చెలిమల్ల రాజయ్య, లక్ష్మీ అనే వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అందిరికి వివాహం చేసి బాధ్యతలు పూర్తి చేశారు.

కుమారుడు, కోడలు పట్టించుకోకపోవడం వల్ల మనస్తాపం చెందిన రాజయ్య, లక్ష్మీ దంపతులు రాత్రి ఆరుబయట చాప వేసుకుని పురుగుల మందు తాగి పడుకున్నారు. ఇన్నేళ్లు కలిసి బతికిన వారు... చావులోనూ ఒకరికి ఒకరు తోడై.. కలిసి తనువు చాలించారు.

ఇన్నేళ్లు తమతో ఎంతో కలివిడిగా బతికిన ఈ దంపతుల ఆకస్మిక మరణం ఇరుగుపొరుగు వారిని, వారి స్నేహితులను కలవరపరిచింది. కుమారుడు సరిగ్గా చూసుకోకవపోవడం వల్లే ఈ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు పోలీసులకు తెలిపారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.