దేశంలోనే తొలి మహిళా భూగర్భ గనుల్లో అండర్ మేనేజర్‌గా అర్హత సాధించి రికార్డ్ సృష్టించిన భూపాలపల్లి జిల్లాకు చెందిన సంధ్యను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. సంధ్యను స్ఫూర్తిగా తీసుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణించి... ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ ఆడపడుచులు సాధిస్తున్న విజయాలు రాష్ట్రానికి గర్వ కారణంగా నిలుస్తాయని కొనియాడారు.
సింగరేణి బొగ్గు గనిలో ఉద్యోగం చేస్తున్న నాన్నను స్ఫూర్తిగా తీసుకొని మైనింగ్ కోర్స్ చదివినట్లు సంధ్య తెలిపారు. పదో తరగతి వరకు భూపాలపల్లిలో... హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ చదివిన సంధ్య... కొత్తగూడెంలో బీటెక్ (మైనింగ్) పూర్తి చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ప్రాంగణ నియమకాల్లో భాగంగా హిందూస్థాన్ జింక్ వేదాంత ఉద్యోగం సాధించారు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీకి దరఖాస్తు చేయగా... సంధ్య నైపుణ్యాలను గుర్తించిన డీజీఎంఎస్ అండర్ గ్రౌండ్ సెకండ్ క్లాస్ మేనేజ్ మెంట్ కాంపీటెన్సీ ధ్రువపత్రాన్ని అందించారు. సంధ్య భూగర్భ గనుల్లో అండర్ మేనేజర్‌గా అర్హత సాధించారు.