జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా బాధితులకు సకాలంలో వైద్యం అందించడంలో పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్ర సత్యవతి రాఠోడ్.. జిల్లా అధికార యంత్రాంగానికి భరోసానిచ్చారు. ఇద్దరు మంత్రులు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిగతా జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్‌పై సమీక్షించారు.
జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో పనిచేయడం మూలంగా కరోనా బాధిత వ్యక్తులకు సకాలంలో వైద్యసేవలు అందిస్తూ.. వారిలో ఆత్మస్థైర్యం నింపి త్వరగా కోలుకునేలా అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నారని మంత్రులు తెలిపారు. కరోనా నియంత్రణకు జిల్లా స్థాయిలో చేయవల్సిన సేవలను సమర్థవంతగా చేస్తున్నారని అధికారులను ప్రశంసించారు.
ఇవీ చూడండి: ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా?: హైకోర్టు