జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో మేడారం జాతరకు సంబంధించి ప్రత్యేక టికెట్ కౌంటర్లను, మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రారంభించారు. ప్రజలందరూ ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని జాతరకు వెళ్లే వారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలని ఎమ్మెల్యే ప్రజలకు తెలిపారు. అలాగే ఈ జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా జరుపుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి టౌన్ తెరాస పార్టీ అధ్యక్షులు క్యాతరాజు సాంబమూర్తి, పురపాలక సంఘం ఛైర్మన్ శ్రీమతి వెంకట రాణి సిద్దు, వైస్ ఛైర్మన్ కొత్త హరిబాబు, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.