ఈనెల 10న జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 2 గంటల వ్యవధిలో రోడ్లకు ఇరువైపులా 2 లక్షల మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ ఆదేశించారు. సింగరేణి ఇల్లందు క్లబ్‌హౌస్‌లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మాసివ్ అవెన్యూ ప్లాంటేషన్‌పై చర్చించి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లాలో 30 నిమిషాల్లో 3 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని చేరటానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కలెక్టర్ అభినందించారు. ఇదేస్ఫూర్తితో ఈనెల 10న ఉదయం 10 గంటల నుంచి 12 వరకు జిల్లాలోని రహదారులకు ఇరువైపులా 2 గంటల వ్యవధిలో 2 లక్షల మొక్కలను నాటాలని కోరారు. ఈనెల 8, 9, 10 తేదీల్లో ప్రతిరోజు పది లక్షల మొక్కల పంపిణీ జరిగేలా ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున అందించాలని, జిల్లాలోని ప్రతి గ్రామంలో అడివిని తలపించేలా... పల్లె వనాలు ఏర్పాటు చేయాలన్నారు.