భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలంటూ జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య.. తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నాలా కన్వర్షన్, పెండింగ్ మ్యుటేషన్లు, మిస్సింగ్ సర్వే నెంబర్ల వివరాల సేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎమ్మార్వోలను ఆదేశించారు. జిల్లాలోని ఇతర సమస్యలపై కూడా దృష్టి సారించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు జీవాకర్ రెడ్డి, షరీఫ్, మాధవి, సునీత, శ్రీనివాస్, ఇక్బాల్, డిప్యూటీ తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పాన్ కార్డుతో నకిలీ వైద్యుడి గుట్టురట్టు