జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆదివారం తాజాగా మరో 10 మంది ఈ వైరస్ బారిన పడినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధార్సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారులు రసాయన ద్రావణాలు పిచికారీ చేయించారు.
మరోవైపు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. వైరస్ వ్యాప్తి తగ్గకపోవడం వల్ల అధికారులు ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. మాస్కులు, భౌతిక దూరం విధిగా పాటించాలని కోరుతున్నారు.
ఇదీచూడండి: రాష్ట్రంలో కొత్తగా 1296 కరోనా కేసులు.. ఆరుగురు మృతి