Watermelon crop damage: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ముఖ్యంగా పుచ్చకాయ తోటలు సాగు చేసే అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఉల్లిగడ్డ పరిణామంలో రాళ్లు కురవడంతో పుచ్చకాయ పగిలిపోయి పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో రైతులు చేసేదేంలేక తమ పంటలను మేకలకు మేత కోసం వదిలేస్తున్నారు.
జనగామ జిల్లాలో ఎర్రగడ్డలో లీలమ్మ అనే మహిళా రైతు.. రెండెకరాల్లో పుచ్చకాయ తోట వేసింది. సుమారు 40 వేల వరకు తోట కోసం ఖర్చుపెట్టింది. పగలనకా రాత్రనకా పంటకు కావలి కాసింది. పందులు, కోతుల నుంచి పంటను కంటికి రెప్పలా కాచుకుంది. ఇంతలో వరుణుడికి కన్నుకుట్టిందో ఏమో.. వడగళ్లు కురిపించాడు. పెద్దపెద్ద రాళ్లు పడటంతో.. పుట్టకాయలు మొత్తం పగిలిపోయాయి. ఇంత కష్టపడినందుకు కనీసం పెట్టుబడి డబ్బులు కూడా రాలేదని రైతు వాపోయింది. చేసేదేమీ లేక.. మేకలకు మేత కోసం పంటను వదిలిపెట్టినట్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవలెే(గురువారం) జనగామ జిల్లాలో ఓ రైతు.. తన పుచ్చకాయ పంట మొత్తం నష్టపోయినందుకు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇదీ చూడండి: