జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గోవర్దనగిరి గ్రామంలో 30 రోజుల గ్రామీణాభివృద్ధి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామసభ రసాబాసగా మారింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రసంగిస్తుండగా... గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా పంటలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చి...దానిని విస్మరించారంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.
ఇదీ చూడండి: 'విక్రమ్' కోసం మరో 14 రోజులు అన్వేషణ : శివన్