ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో బస్ రోకో నిర్వహిస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని కార్మికులు ఆరోపించారు.
43 రోజులుగా సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : బస్ రోకోకు అనుమతి లేదు: సీపీ