ETV Bharat / state

'తెలంగాణ రైతులను ధనవంతుల్ని చేస్తాం' - తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​ రెడ్డి

దేశంలోనే తెలంగాణ రైతులను ధనవంతులుగా తీర్చిదిద్దుతామని రైసస రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని తెలిపారు.

telangana raithu samanvaya samithi state president palla rajeshwar reddy says that telangana farmers would be country's richest farmers
తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​ రెడ్డి
author img

By

Published : Dec 22, 2019, 3:24 PM IST

తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​ రెడ్డి

రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పల్లా రాజేశ్వర్​రెడ్డి తొలిసారి ఉమ్మడి వరంగల్​ జిల్లాలో పర్యటించారు. జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి.

భారీ ర్యాలీతో జిల్లా కేంద్రానికి చేరుకున్న పల్లా... ప్రధాన చౌరస్తాలోని అంబేడ్కర్​ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.
రైతులకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని, త్వరలోనే తెలంగాణ రైతులను దేశంలోనే ధనవంతులుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

జనగామ జిల్లాలోని ప్రతి ఎకరానికి నీరు అందించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ప్రత్యేక' ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ ప్రారంభం

Intro:tg_wgl_61_22_pallaku_ghana_swagatham_ab_ts10070
nitheesh, jangama, 8978753177
రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి ఉమ్మడి వరంగల్జిల్లా కు వచ్చిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కి తెరాస శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ కళతోరణం వద్ద ఎమ్మెల్యే రాజయ్య, ఎంపీ కవిత, జడ్పీచైర్మన్ పగాల సంపత్ రెడ్డి, రైతు సమన్వయ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి , కార్యకర్తలు పుష్పగుచ్చలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీతో జనగామ జిల్లా కేంద్రానికి చేరుకొని, ప్రధాన చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారని పింఛన్ ను వెయ్యి రూపాయల నుంచి 2వేలు చేశారని, రైతు బంధు పెట్టుబడిని 4వేల నుంచి 5వేలు చేశారని, రైతుబీమా 7వందల కోట్ల నుంచి 11వందల కోట్లు కెటయించమని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 60లక్షల ఎకరాలకు వచ్చే ఆరు నెలలో నీరు అందిస్తామని, 24గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువులు సమయానికి అందిస్తున్నామని, రైతులకు కావల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, భారత దేశంలోనే తెలంగాణ రైతులను ధనవంతులుగా తీర్చిదిద్దుతామని, జనగామ జిల్లాలోని ప్రతి ఎకరానికి నీరు అందించి సశ్యశ్యామలంగా చేస్తామన్నారు.
బైట్: పల్లా రాజేశ్వర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు

Body:1

Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.