రైతులు మూస పద్ధతి వదిలి నూతన వ్యవసాయ విధానాలు అలవాటు చేసుకొని... ఆర్థికంగా ఎదగాలని స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యుడు తాటికొండ రాజయ్య సూచించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో నియంత్రిత పంటల సాగు విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. రైతులు దీర్ఘకాలిక పంటలు కాకుండా స్వల్పకాలిక పంటలను వేసుకోవాలని తెలిపారు. ఎప్పుడూ ఒకే రకమైన పంట కాకుండా పంట మార్పిడి విధానంతో భూసారాన్ని పెంచుకోవాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విత్తన ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు సీఎంకు ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. కంది, పత్తి సాగు చేసి ఎక్కువ లాభాలు పొందాలని తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్ కేసులు