ETV Bharat / state

'తెలంగాణ వచ్చాక 45వేల చెరువులు బాగు చేసుకున్నాం’

నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్టు స్టేషన్​ ఘన్​పూర్​ శాసనసభ్యుడు తాటికొండ రాజయ్య తెలిపారు. జనగామ జిల్లా చిల్పూర్​ మండలంలో నిర్మించ తలపెట్టిన చెక్​డ్యాం పనులకు ఆయన శంకుస్థాపన చేసి.. పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలో మరిన్ని చెక్​డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

MLA Rajaiah Inaugurates Dam Works
తెలంగాణ వచ్చాక 45వేల చెరువులు బాగు చేసుకున్నాం’
author img

By

Published : May 26, 2020, 10:31 PM IST

జనగామ జిల్లా పరిధిలోని స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. చిల్పూర్​ మండలంలో ఒక కోటి 74 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన చెక్​డ్యామ్​ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలో మరో ఆరు చెక్​డ్యామ్​లో నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు రూ.15 కోట్ల 60 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. చెక్​డ్యామ్​ల నిర్మాణం కోసం టెండర్లు కూడా పూర్తి చేసినట్టు తెలిపారు.

తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు మిషన్​ కాకతీయ ద్వారా 45వేల చెరువులు మరమ్మతుకు శ్రీకారం చుట్టి 20వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. దేవాదుల ద్వారా చెరువులు, కుంటలకు నీరు అందించి రైతులను ఆదుకున్న తెలంగాణ భగీరథుడు కేసీఆర్​ అని ఆయన కొనియాడారు.

ఇదీ చదవండి: గొర్రెకుంట హత్యల నిందితునికి 14 రోజుల రిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.