ETV Bharat / state

'హిజ్రాలను దాతలు ఆదుకోవాలి'

లాక్​డౌన్​ కారణంగా అత్యంత దుర్భర జీవితం గడుపుతున్న వారిలో హిజ్రాలు ఒకరని... వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని రాష్ట్ర అధ్యక్షురాలు లైలా విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో ట్రాన్స్​జెండర్స్​కు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

author img

By

Published : May 28, 2020, 5:43 PM IST

Distribution of essential commodities to transgenders in Janagama district
'హిజ్రాలను దాతలు ఆదుకోవాలి

భిక్షాటన చేసి జీవనం కొనసాగుస్తున్న హిజ్రాలు ఆకలితో బాధపడుతున్నారని దాతలు ముందుకు వచ్చి తమ ఆకలి బాధలు తీర్చాలని ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు లైలా విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో హిజ్రాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, ఖర్చుల నిమిత్తం 5 వందల రూపాయలను అందించారు.

రైళ్లలో, దుకాణాల వద్ద భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్న హిజ్రాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారని, దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.