30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టిసారించారు. రోడ్లపై చెత్తవేసినా.. బహిరంగ మలవిసర్జనకు వెళ్లినా పంచాయతీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జగిత్యాల పట్టణంలోని మోచి బజార్లో రోడ్డుపై చెత్త వేసిన వస్త్ర దుకాణం యాజమానికి రూ. 3 వేలు జరిమానా విధించారు అధికారులు. నిబంధనకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజలు సహకరించాలని పురపాలక కమిషనర్ రవిబాబు కోరారు.
ఇవీ చూడండి: పూల సింగిడి... 28నుంచి బతుకమ్మ వేడుకలు